టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహాత్మాగాంధీ, నెహ్రూ చేసిన తప్పిదాలవల్లే ఇండియాకు, పాకిస్తాన్‌కు గొడవలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అఖండ భారత్‌గా ఏర్పాటు చేయాలని సూచించాడు! యుద్ధం వల్ల 10 కోట్ల మంది చనిపోయినా పరవాలేదని, రోజుకొక సైనికుడు చనిపోవడం కంటే, అదేనయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసాడు.
పాక్ వేసే అణుబాంబులను మూడు సెకన్లలోపే గ్రహించి, ఎదుర్కోగల సత్తా భారత్ కు ఉందని జేసీ తెలిపారు.
నిజానికి గాంధీ, నెహ్రూ లను ఉద్దేశించి చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగా ఆర్ ఎస్ ఎస్, బాజాపా శ్రేణులనుంచి తరచూ వస్తూ వుంటాయి..
మోడీజీ.. ఇది విన్నారా మరి??

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి