మనిషి ఊహల్ని కలల్లోనైనా నిజం చేస్తామంటున్నారు 'కిక్ స్టార్టర్ ' కంపెనీ వాళ్ళు.
నచ్చిన అమ్మాయితో డేటింగ్ వెళ్ళినట్టు, అభిమాన నటుడికి షేక్ హ్యాండిచ్చి, ఫోటొ దిగినట్టు, కోటీశ్వరుడైపోయి ప్రపంచమంతా చక్కర్లు కొడ్తున్నట్టు...ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో తీరని కోర్కెలు. మరి వాటిని కలలోనైనా చూసుకుని ఆనందపడ్డానికి నేనున్నానంటోంది ‘ల్యూసిడ్ డ్రీమర్’!!
ఈ పరికరాన్ని నుదురుకు తగిలించుకుని నిద్రపోతే ఎంచక్కా మనం కోరినట్టుగా కలలు కనేయొచ్చట. ఇందులో అమర్చిన సెన్సర్ల ద్వారా వెలువడే సంకేతాలు మెదడును నియంత్రించి మనకు నచ్చిన స్వప్నాల్ని సాక్షాత్కరించేందుకు తోడ్పడతాయట.
ఈ సరికొత్త పరికరం తయారీ చివరిదశలో ఉంది. ఎంపిక చేసిన అరుదైన ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించే ప్రఖ్యాత సంస్థ ‘కిక్ స్టార్టర్’ కలల సాకారానికి పూనుకుంది.
కాబట్టి, ఈలోగా మన కలల లిస్ట్ రాసిపెట్టుకుని, కొద్దికాలం వేచిచూడక తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి