google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పేకాట కేసులో రానా, ప్రకాశ్ రాజ్??!!

21, అక్టోబర్ 2016, శుక్రవారం

పేకాట కేసులో రానా, ప్రకాశ్ రాజ్??!!



 యువనటుడు రానా, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ లు..  రమ్మీ(పేకాట)ని ప్రోత్సహించేలా ప్రకటనలు చేస్తున్నారంటూ తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన పి.ఇళగోవన్ అనే సామాజిక కార్యకర్త కేసు వేశాడు.

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే రానా ఇప్పుడు ఈ ప్రకటన వల్ల వివాదంలో ఇరుక్కున్నట్టైంది..  

‘‘రానా, ప్రకాష్ రాజ్‌లు పలు వెబ్ సైట్ల ద్వారా గాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. రమ్మీ ఆడేందుకు పురిగొల్పేలా ప్రకటనలు ఇస్తున్నారు. టీవీల్లోనూ అవి ప్రసారం అవుతున్నాయి. పలు వెబ్‌సైట్లు కూడా బెట్టింగ్‌కు పురిగొల్పుతున్నాయి’’ అంటూ కోయంబత్తూర్ కమిషనర్‌కు ఇళగోవన్ ఫిర్యాదు చేశాడు.

 కాగా, బెట్టింగ్, రమ్మీ, గాంబ్లింగ్‌లపై నిషేధం ఉండడంతో ఇళగోవన్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని, నేడో రేపో నటులిద్దరికీ సమాచారం అందజేస్తామని  పోలీసులు తెలిపారు.

ఐనా, ఏం తక్కువైందని, ఇలాంటి ప్రకటనల్లో నటించాల్సి వచ్చింది బాబులూ??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి