తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వుండే వర్మ ఇద్దరు మాజీ ప్రధానులపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు.
పార్లమెంట్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయ్, పీవీ.నరసింహరావు, సోనియా గాంధీ ఉన్న పాత ఫోటోని ట్విట్టెర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో సోనియా ముందు వరుసలోవుండగా, ఇద్దరు మాజీ ప్రధానులు ఆమె వెనుక బెంచ్‌లో కూర్చొన్నారు. ఈ ఫోటోపై తనదైన శైలిలో 'బ్యాక్ బెంచర్స్ స్కూల్లోనైనా, పార్లమెంటులో అయినా చెడ్డవారేనని ' చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని వర్మ, ఫోటోలో కనిపించే ముగ్గురు ఎవరో తనకు తెలియదని.. కానీ ఒకరిని మించి మరొకరు చెడ్డవారిలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించాడు.
ఇదే ఫోటోని మళ్ళీ రెండోసారి ఫోస్ట్ చేసి.. మహిళలను అగౌరవంగా చూసే భారతీయ పురుషుల స్వభావాన్ని ఈ ఫోటో తెలియజేస్తోందని, ఫోటోలో ఉన్న వ్యక్తులెవరో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.
'ఫోటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైనా కావొచ్చు కానీ లక్షణంగా, హుందాగా ఉన్న ఓ మహిళపై డర్టీ జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని ' వ్యాఖ్యానించాడు .
చిత్రంలో మాజీ ప్రధానులు వాజ్ పేయ్, పీవీ.నరసింహరావు, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉండడంతో.. వర్మ ట్వీట్ చదివినవాళ్ళు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.
ఎవరో తెలియదని చెప్పడం, ఒక పాత ఫోటో ఆధారంగా ట్వీట్ చెయ్యడం, పోలీసుల ఎంక్వయరీ కోరడం లాంటి అవగాహన లేని వ్యాఖ్యల వల్ల, వర్మ తెలివితేటలు నాలెడ్జ్ మీద తప్పకుండా సందేహం కలగక తప్పదు. కేవలం సెన్షేషన్ క్రియేట్ చెయ్యడం కోసం వర్మ ఇలాంటి చౌకబారు వార్తలు సృష్టించడం మానుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడ్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి