google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: చందూ కి బిగ్ ఆఫర్

20, అక్టోబర్ 2016, గురువారం

చందూ కి బిగ్ ఆఫర్



‘‘ప్రేమమ్‌’ సినిమా సాధించిన ఘనవిజయంతో ఖుషీగా వున్న దర్శకుడు చందు మొండేటి కి ఊహించని బంపర్ ఆఫర్ లభించింది.

  ఎప్పుడూ కొత్తదర్శకుల్ని ప్రోత్సహించే నాగర్జున  డైరెక్షన్ ఆఫర్ ఇచ్చి, చందూని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు.

బుధవారం హైదరాబాద్‌లో 'ప్రేమం ' విజయోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అథిదిగా హాజరైన నాగార్జున చందూ దర్శకత్వ శైలిని, 'ప్రేమం ' ని హాండిల్ చేసిన విధానాన్ని మెచ్చుకున్నాడు.

'మలయాళం వున్నట్టే తీస్తే మనవాళ్ళు ఆదరించరు, ఆ విషయాన్ని చందూ చక్కగా అర్థంచేసుకుని , తనదైన శైలిలో తీసి, మంచి విజయాన్ని అందించాడు, అందుకే అతడ్ని నాతో కూడా ఓ సినిమా తీయమని అడుగుతూ వున్నా' అని నాగ్ అన్నాడు.

ఇక చందూ మొండేటి నాగార్జున కోసం కథ తయారు చేసుకోవడమే తరువాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి