ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17మంది మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఒడిశారాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా రామగృహ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.
మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ దళాలు నిన్నటి నుంచీ ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్న ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు హతం కాగా, ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
ఘటనా స్థలంలో మూడు ఏకే47 తుపాకులు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ సంఘటనలో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి