మొబైల్ ఫ్రీమెసేజ్, కాల్స్ విషయంలో వాట్సప్ ని మించిన యాప్ లేదన్నది తెలిసిన విషయమే. టెక్స్ట్ మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ లు, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు ఇలా అన్నీ ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పించింది.
అయితే ఇన్నివున్నా ఈ యాప్ వినియోగదారుల్లో ఉన్న కొద్ది పాటి నిరాశ ఏమైనా ఉందంటే అది కచ్చితంగా వీడియో కాల్ ఆప్షన్ లేకపోవడమే. అయితే తాజాగా సౌకర్యాన్ని కూడా కలుపుకుని ముందుకురాబోతోంది వాట్సప్!
ఆండ్రాయిడ్ బీటావర్షన్ తో వీడియో కాల్ చేసుకునే ఫీచర్ ను వాట్సప్ తాజాగా యాడ్ చేసింది. కాకపోతే ఈ ఆప్షన్ ప్రస్తుతానికి బీటా 2.16.316 ఆ తరవాత వచ్చిన వర్షన్లలో అందుబాటులో వుంటుంది. మీరు వీడియో కాల్ చేయాలంటే కచ్చితంగా అవతలివారు కూడా ఈ వెర్షన్లకు అప్ డేట్ అయి ఉండాలి!
రెగ్యులర్ వెర్షన్ వాడేవాళ్లంతా బీటావర్షన్ ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ లేదంటే ఏపీకే మిర్రర్ వంటి వెబ్ సైట్ల ద్వారా బీటా వర్షన్ 2.16.316 లేదా 2.16.318 వర్షన్లు నేరుగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి