ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్లతో స్మార్ట్ వాచీలను తీసుకొచ్చే ఆపిల్, నైక్ కంపెనీతో కలిసి మరో కొత్త స్మార్ట్‌వాచీ ని విడుదల చేస్తోంది.
ఆపిల్ వాచ్ రెండో సిరీస్‌లో భాగంగా.. ఆపిల్, నైక్ కలసి రూపొందించిన ఈ గ్యాడ్జెట్ స్మార్ట్‌వాచీగానే కాకుండా, ఫిట్‌నెస్ ట్రాకర్‌గా కూడా పని చేస్తుంది.
వాచీలను రెండు మోడళ్లుగా రూపొందించారు. 38 మి.మి. మోడల్ ధర రూ. 32,900,
42 మి.మి మోడల్ రూ. 34,900.
ఈ వాచీలను వినియోగించాలంటే, ‘నైక్ ప్లస్ రన్ క్లబ్’ ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఆపిల్ వాచీలకన్నా డిస్‌ప్లే ఇంకాస్త ప్రకాశవంతంగా ఉండటం దీని ప్రత్యేకత.
దీన్ని ఈ నెల 28 నుంచి ఆపిల్, నైక్ స్టోర్స్‌లో కొనుగోలు చేయొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి