google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ముఖేష్ ఆస్తి ఎంతో తెలుసా..?

21, అక్టోబర్ 2016, శుక్రవారం

ముఖేష్ ఆస్తి ఎంతో తెలుసా..?



ముఖేష్ అంబాని వరుసగా తొమ్మిదో ఏడాది దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఈయన సంపద ఏకంగా ఈస్టోనియా దేశ జీడీపీతో సమానం కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

 ఫోర్బ్స్‌ ప్రకటించిన లెక్కల ప్రకారం ముఖేష్‌ అంబానీ ఆస్తి విలువ 22.7 బిలియన్‌ డాలర్లు.
 రెండోస్థానంలో ఉన్న సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ ఆస్తి 16.9బిలియన్‌ డాలర్లు.
 మూడో స్థానంలో ఉన్న హిందుజా కుటుంబానిది 15.2బిలియన్‌ డాలర్లు.
 నాలుగో సంపన్న వ్యక్తి అజీంప్రేమ్‌జీ ఆస్తి 15బిలియన్‌ డాలర్లు.
 13.90 బిలియన్‌ డాలర్ల ఆస్తితో పల్లోంజీ మిస్త్రీ అయిదో స్థానంలో నిలిచారు.

వీళ్ళ మొత్తం ఆస్తుల విలువ మన కరెన్సీ లో అయితే రూ.5.59 లక్షల కోట్లు.
వీరి వద్ద ఉన్న మొత్తంతో 18సార్లు రియో ఒలింపిక్స్‌ నిర్వహించవచ్చునని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.

ఈ సంపన్నుల  ఆస్తి మొత్తం కలిపితే 1,230సార్లు మంగళ్‌యాన్‌ చేసి రావచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి