google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రంభ పిటిషన్ ట్విస్ట్!!

26, అక్టోబర్ 2016, బుధవారం

రంభ పిటిషన్ ట్విస్ట్!!



 తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని, కెనడాలో వున్న తన భర్తతో కలిసి జీవించేలా అత్తింటి తరపు వారిని ఒప్పించాలని నిన్న చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన వెటరన్  సినీనటి రంభ, దానికి అనుబంధంగా బుధవారం మరో పిటిషన్‌ వేసింది.

మొదటి పిటిషన్‌ అంశంలో కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసే లోపు, తనకు నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతిని భర్త నుంచి ఇప్పించాల్సిందిగా కోరుతూ  ఈరోజు తన రెండో పిటిషన్‌లో పేర్కొంది.

 కెనడాలో వ్యాపారాలు చేస్తున్న తన భర్త నెలకు రూ.25లక్షల వరకు సంపాదిస్తున్నాడని, తనకు నటిగా ప్రస్తుతం అవకాశాలేవీ రావడం లేదని, ఇతర ఆదాయ మార్గాలేవీ లేవు కాబట్టి, తాను, తన ఇద్దరు కుమార్తెల పోషణ, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలా తన భర్త ఇంద్రన్‌కు ఆదేశాలు జారీ చేయాలని రంభ తన పిటిషన్‌లో కోరింది.

నిజానికి రంభ భర్త దగ్గరకు తిరిగి వెళ్ళాలని కోరుకోవడం లేదనీ, కేవలం భృతికోసమే ఇలా కోర్టుకెక్కిందనీ పరిశీలకులు అభిప్రాయ పడ్తున్నారు. నాలుగేళ్ళుగా భర్త నుంచి వచ్చేసి ఇండియాలో వుంటున్న రంభ ఇప్పుడు పిటిషన్ వెయ్యడం వెనుక అసలు కారణం అదేనని అనుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి