సాక్షాత్తూ సుప్రీంకోర్టులో, ప్రధాన న్యాయమూర్తి ముందే ఇద్దరు లాయర్లు గట్టిగా అరుచుకోవడంతో, సహనం కోల్పోయిన జస్టిస్ టీఎస్ ఠాకూర్‌జస్టిస్ ఠాకూర్ ‘నోర్మూసుకోండి.. లేదంటే బయటికి గెంటివేయిస్తా’ అని తీవ్రంగా హెచ్చరించారు. ‘‘ఎందుకలా అరుస్తున్నారు? ఇది కోర్టా చేపల మార్కెట్టా? కోర్టులో హుందాగా వ్యవహరించాలి. కోర్టు హాలులో పద్ధతిగా నడుచుకోలేని వారంతా సీనియర్ లాయర్లు కావాలనుకుంటున్నారు! ఇదే అసలు ప్రొబ్లం’’ అని వ్యాఖ్యానించారు.
గట్టిగా అరుస్తూ, చిటపటలాడితే మేలు జరుగుతుందనుకుంటున్నారా?’’ అని జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు.
న్యాయవాదులకు ‘సీనియర్ అడ్వొకేట్’ హోదా ఇవ్వడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గట్టిగా వాదులాటకు దిగిన ఇద్దరు లాయర్లపై ప్రధాన న్యాయమూర్తి ఇలా మండిపడ్డారు.
సినిమాల్లో చూపినట్టుగా కాకుండా, కోర్టుల్లో న్యాయవాదులు వాదనలు మాత్రమే వినిపించాలి. గట్టిగా వాదులాడుకోకూడదనేది ప్రాథమిక సూత్రం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి