బదరీ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే వున్నాయి.
గత వారం రోజులుగా ఎత్తిన కాలు దించకుండా షిర్డి సాయిబాబాపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తున్న స్వరూపానంద నిన్న హైదరాబద్ లో కూడా విరుచుకుపాడ్డారు.
ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లలితకళాతోరణంలో ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా సాయి అనే భూతాన్ని పూజిస్తున్నారు. షిర్డిసాయి భూమిపై పుట్టారే తప్ప అవతరించిన వారు కాదు. సాయిని దేవుడిని చేసి హిందువులను మూర్ఖులను చేయకండి. సీతారం బదులు సాయిరాం అని ఎందుకు అంటున్నారో ప్రజలే ఆలోచించుకోవాలి’’ అని స్వరూపానంద సరస్వతీ వాఖ్యానించారు.
సంతోషిమాత వచ్చింది, వినాయకుడు పాలు తాగాడు లాంటి అభూత కల్పనలతో సనాతన ధర్మం పరువు తీయవద్దన్నారు. జిహాద్ పేరిట పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు దేశమంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా అమృతానంద స్వామి మాట్లాడుతూ.. సాయిబాబా దేవుడు కాదని షిర్డీలో సాయిసంస్థాన్ సభ్యులకే సవాల్ విసిరామని, రెండునెలలు గడువిచ్చినా ఎవరూ ముందుకు రాలేదన్నారు.
కాగా స్వరూపానంద సాయిబాబా గురించి మాట్లాడుతుండగా సభలో ఉన్న సాయి భక్తులు ఒక్కసారిగా నిలబడి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి