google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: బాబు కంటే కేసీఆర్‌ది దరిద్రమైన పాలన!!

24, అక్టోబర్ 2016, సోమవారం

బాబు కంటే కేసీఆర్‌ది దరిద్రమైన పాలన!!




 టీఆర్‌ఎస్ సర్కార్‌పై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ పాలన దరిద్రంగా ఉందని ధ్వజమెత్తారు.

నల్లగొండ జిల్లాలో  ఆదివారం ఓ శుభకార్యానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు ఎన్. భాస్కర్‌రావు, రవీంద్రనాయక్‌ లు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.వారు  గనక విజయం సాధిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి తన విలాసాలు, అట్టహాసాలు, వాస్తుల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మరోసారి అధికారంలోకి రావడంకోసం ప్రభుత్వం తప్పుడు సర్వేలతో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

చంద్రబాబూ.. హ్యాపీనా మరి..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి