google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సర్జికల్ అటాక్స్ ఇంకోసారి??

22, అక్టోబర్ 2016, శనివారం

సర్జికల్ అటాక్స్ ఇంకోసారి??




మీరు విన్నది నిజమే.!

ప్రధాని నరేంద్ర మోదీ సర్జికల్ అటాక్స్ గురించి ప్రస్తావించారు. అయితే, ఈసారి దాడి ఉగ్రవాద శిభిరాలపై కాదు., నల్లధనం భయట పెట్టని అవినీతిపరులపై!!

వడోదరలో జరిగిన ఓ  కార్యక్రమంలో పాల్గొన్నప్రధాని సర్జికల్ దాడుల గురించి మాట్లాడారు. నల్లధనం వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకంతో దాదాపు 65 వేల కోట్ల రూపాయలు వచ్చిన సంగతి తెలిసిందే.

 అవినీతిపరులపై ప్రభుత్వం ఎలాంటి సర్జికల్ దాడులు జరపకుండానే వేల కోట్ల రూపాయలు వచ్చాయని, అదే సర్జికల్ దాడులు జరిపి ఉంటే ఇంకా ఎంత బయటకు వచ్చేవో అని చమత్కరించారు. ఉగ్రవాదులపై జరిపినట్టుగానే, నల్లధనాన్ని బయటపెట్టని వారిపై త్వరలో సర్జికల్ దాడులు లాంటివి జరుపుతామని ప్రధాని పరోక్షంగా హెచ్చరించారని అనుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి