ఒక్క ‘బాహుబలి’ 100 సినిమాలతో సమానమని ప్రభాస్ అన్నాడు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి, ద కంక్లూజన్’లో మహేంద్ర బాహుబలి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి తర్వాత 5 నెలల విరామం వచ్చినా , మరో సినిమాకు పనిచెయ్యకుండా, కేవలం బాహుబలి 2 కోసమే వేచిచూసానని చెప్పుకొచ్చాడు.
కాగా రాజమౌళి మాట్లాడుతూ, బాహుబలి2 మొదటిబాగానికి సీక్వెల్ కాదని, కథని రెండు భాగాలుగా చెబుతున్నామని అన్నాడు.
ఇదే సందర్భంలో కథానాయకి తమన్నా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తనకు తెలిసిపొయిందని, ప్రభాస్ తో మాట్లాడుతూండగా ఆ విషయం బయటపడిపోయిందనీ, సరదాగా వ్యాఖ్యానించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి