google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా ఒక్క రూపాయకే!!

24, అక్టోబర్ 2016, సోమవారం

అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా ఒక్క రూపాయకే!!




ఉచిత ఆఫర్లతో కస్టమర్లను జియో తన వైపునకు తిప్పుకోవడంతో, దిక్కుతోచని నేపథ్యంలో మిగతా అన్ని ఆపరేటర్ నెట్వర్క్ లు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి. ఇందులో భాగంగా అన్ని కంపెనీలు భారీ ఆఫర్లకు తెరలేపడం మొదలు పెడుతున్నాయి.

ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐడియా ఒక్క రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటాను ప్రవేశపెట్టింది.!

దీన్ని పొందడానికి మీ వద్ద  4జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌  లో ఐడియా 4జీ సిమ్‌ తప్పనిసరిగా ఉండాలి. మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్‌ ఉండాలి. మీ 4జీ హ్యాండ్‌సెట్‌లో నుంచి 411కు కాల్‌ చేసాక అందులో చెప్పే సూచనలను ఫాలో అవాలి..

 ఆఫర్‌ యాక్టివేట్‌ అయిన తరువాత మీకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కన్ఫర్మేమేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఇక మీరు 4జీ అన్‌లిమిటెడ్‌ డేటాను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం ఓ గంట వరకు మాత్రమే పనిచేస్తుంది.

ఈ ఆఫర్‌లో ఐడియా ఇచ్చే డేటాను గంట వరకు అపరిమితంగా  4జీబీ నుంచి 5 జీబీ వరకు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐతే ఒకే నంబర్‌పై ఈ ఆఫర్‌ను మూడుసార్లు మాత్రమే వాడకోవచ్చు. ఆ తరువాత ఈ ఆఫర్‌ పనిచేయదు. వేరే ఫోన్‌ నుంచి ప్రయత్నిస్తే మళ్లీ ఈ ఆఫర్‌ మీకు వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి