google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఆ విషయంలో కేసీఆర్‌ నంబర్ 1 !!

29, అక్టోబర్ 2016, శనివారం

ఆ విషయంలో కేసీఆర్‌ నంబర్ 1 !!




 ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంలలో కేసీఆర్‌ మొదటిస్థానంలో ఉంటారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించాడు.

వీడీపీ అసోసీఎట్స్ అనే సంస్థ చేసిన సర్వేలో కేసీఆర్ ప్రజాధరణలో నెం 1 స్థానంలో వున్నారని తేలిన నేపథ్యంలో... తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించాడు.

 సర్వేపై నమ్మకం ఉంటే, టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు వెళ్లాలని పొన్నం డిమాండ్ చేశారు. అబద్దాలు, ఆర్భాటాలు, అవినీతిలో కేసీఆర్‌ ముందున్నారని పొన్నం ఆక్షేపించాడు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చడంలో కూడా కేసీఆర్ నెం 1 గా వున్నారని మాజీ ఎంపీ పొన్నం ఘాటుగా విమర్శించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి