మెగాస్టార్ కోడలు, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన ఇన్నాళ్ళకు తన మనసులోని మాటల్ని మీడియాతో పంచుకుంది. ఓ ఇంటర్వ్యూ లో తన అందం, పిల్లలు, డైవర్స్ గాసిప్స్.. ఇలా అన్నింటి గురించి సమాధానం ఇచ్చింది.
పెళ్లి సమయంలో ఉపాసన అందం గురించి చాలా కెమెంట్లు వచ్చాయన్నదానికి స్పందిస్తూ.. ‘మా ఆయనకు చాలామంది గార్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లంతా చరణ్‌కు బాగా అందంగా ఉన్న అమ్మాయే భార్యగా రావాలని కోరుకున్నారేమో... అందుకే నా అందాన్ని అలా విమర్శించారు, అయినా నేను దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకున్నానని ' సమాధానం చెప్పింది.
ఇక, పెళ్లి అయ్యి 4 యేళ్ళు గడుస్తున్నా, పిల్లల్ని కనకపోవడానికి కూడా వివరిస్తూ... ' ఎంతో కష్టపడి బరువు తగ్గాను. ఇప్పుడు పిల్లలంటే మళ్లీ బరువు పెరిగిపోతాను. నేను ఎప్పుడైతే పిల్లల్ని కనాలనుకుంటానో అప్పుడే కంటాను. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు., పిల్లలు అనేది పర్సనల్ విషయం. ఇప్పుడే మేం సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ తర్వాతే పిల్లలు’ అని చెప్పింది.
అలాగే చరణ్‌తో డైవర్స్ గ్యాసిప్‌లపై కూడా మాట్లాడుతూ.. ‘నిజానికి మేం గనక డైవర్స్ తీసుకోవాలనుకుంటే, మేమే మీడియా ముందుకు వచ్చి చెబుతాం., మాకలాంటి ఆలోచనే లేదు, ఎందుకంటే మేమిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్., కాబట్టి డైవర్స్ రూమర్లను ఇకనైనా ఆపండి’ అని చెప్పింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి