తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని, వదంతులను సృష్టించిన విషయంలో, తూత్తుకుడికి చెందిన సహాయం అనే యువకుడిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.
సామాజిక మాధ్యమాలలో జయ ఆరోగ్యం పట్ల దుష్ప్రచారాన్ని సృష్టించేవారి కోసమే సైబర్‌క్రైం డిపార్టుమెంట్ ప్రత్యేకంగా నిఘా వుంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 50కి పైగా కేసులు కూడా నమోదయ్యాయి.
సహాయాన్ని విచారిచిన పోలీసులు, బుధవారం అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి కారాగారానికి తరలించారు.
కాగా జయలలిత త్వరగా కోలుకుంటున్నట్టు తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి