google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మూడు హెలికాప్టర్లతో గాలింపు

28, అక్టోబర్ 2016, శుక్రవారం

మూడు హెలికాప్టర్లతో గాలింపు



ఏఓబి లో ఎన్ కౌంటర్ తర్వాత   మావోయిస్టు అగ్రనేత ఆర్కే లక్ష్యంగా  ఆంధ్రా-ఒడిసా సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా విస్తృత స్థాయిలో గాలింపు జరుగుతోంది. గురువారం ఏకంగా మూడు హెలికాప్టర్లతో ప్రత్యేక దళాలు గాలింపు చేపట్టారు.


 బూసిపుట్టు, కుమడ, రంగబయలు, బాబుశాల, బుంగాపుట్టు, రామగూడ, బెజింగి, పసనపుట్టు, పనస, పంపరమెట్ట, సిర్లమెట్ట తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో గాలింపు జరుగుతున్నాయి.

ఓ వైపు ఇలా వుండగా మావోయిస్ట్ నేత ఆర్కే ఆచూకి పై ఇరువర్గాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్కే పోలీసుల అదుపులోనే వున్నట్టు ప్రజాసంఘాలు అనుమానిస్తుండగా, పోలీసువర్గాలు మాత్రం ఆమాటల్ని కొట్టిపారేస్తున్నాయి.

అనధికారకంగా అందిన సమాచారం మేరకు ఎన్ కౌంటర్ సంఘటనలో గాయపడ్డ ఆర్కే, ఏఓబి పరిసర ప్రాంతాల్లోనే వున్నట్టు తెలుస్తోంది. తప్పించుకున్న మావోయిస్ట్ లు ఎవరైనా గాయపడివుంటే చికిత్స చేయిస్తామని నిన్న డీజీపి ప్రకటించడం కూడా.. ఆర్కే గాయపడ్డాడని చెప్పడానికి ఆధారంగా కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి