ఇన్నాళ్ళకు భాను ప్రియ పాత జ్ఞాపకాల బూజు దులిపి, ఓ ప్రేమ కథను బయటకు తీసింది.
ఆ కథలో కాథానాయిక తనే గానీ.. హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.అతను మరెవరో కాదు సీనియర్ దర్శకుడు వంశీ!!
భానుప్రియతో సితార లాంటి కళాఖండాని తీయడమే కాకుండా, ప్రేమించు పెళ్ళాడు, అన్వేషణ, ఆలాపన లాంటి సూపర్ హిట్లు కూడా తీసిన వంశీ, తనను ప్రేమించాడనీ, పెళ్ళి ప్రపోజల్ కూడా తెచ్చాడని, ఓ ఇంటర్వ్యూ లో ఆమె చెప్పారు.
అప్పటికే వివాహితుడైనందున వంశీ ప్రపోజల్ ను తన అమ్మ తిరస్కరించిందని, ఆ కథ అంతటితో ఆగిపోయిందని ఆమె తెలియజేసింది.
ఐనా ఇన్నాళ్ళకు ఈ రహస్యాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు కానీ, ఇంత చెప్పిన భానుప్రియ, తనుకూడా వంశీ పట్ల ఆకర్షణలో పడిందో లేదో చెప్పలేదు.
సంచలానాత్మకమైన ఈ వార్త ఇంకా డైరక్టర్ వంశీ దాకా చేరిందో లేదో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి