మూడు సార్లు తలాక్ చెప్పి, ముస్లిం మహిళలకు విడాకులిచ్చే విధానంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో, మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు.
ఈ విధానాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకిస్తూ, తన అబిప్రాయాన్ని తెలియజేసారు. ఈ వివాదాస్పద అంశాన్ని రాజకీయం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపిచ్చారు.
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ‘మహా పరివర్తన్ ర్యాలీ’లో మోదీ ప్రసంగిస్తూ.. 'నా ముస్లిం సోదరీమణులు ఏం పాపంచేశారు? కొందరు ఫోన్లోనే తలాక్ చెప్పేసి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు’ అని ఆవేదన చెందారు. మూడు సార్లు తలాక్ అంశాన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చవద్దని టీవీ చానళ్లకు విజ్ఞప్తి చేశారు.
‘మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు ఉండకూడదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మతం ఆధారంగా మహిళల పట్ల వివక్ష కూడదని, మూడుసార్లు తలాక్ చెప్పి ముస్లిం మహిళల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవడమే ప్రభుత్వ వైఖరి ' అని, ఆయన తేల్చి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి