మణిపూర్ ఉక్కు మహిళ ఐరోమ్ షర్మిలాచాను తన కొత్త రాజకీయ పార్టీని మొదలుపెట్టారు. పేరు ‘పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'
మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల ను రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్లపాటు సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేసిన షర్మిలచాను ఈ ఏడాది ఆగస్టులో తన దీక్షను విరమించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనే, తాను రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర శాసనసభకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబిసింగ్‌పై పోటీ చేస్తానని షర్మిల తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి