తెరమీద కనిపించే వాళ్ళకంటే, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, కాపలా కాసే సైనికులే నిజమైన హీరోలని సీనియర్ హిందీ నటుడు నానాపటేకర్ వ్యాఖ్యానించాడు.
గత కొద్ది రోజులుగా పాక్ కళాకారుల దేశ బహిష్కరణ విషయంలో సినీరంగ ప్రముఖల్లో రకరకాల అభిప్రాయాలు, విభేదాలని దృష్టిలో వుంచుకుని, నానాపటేకర్ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
సినిమా హీరోలంతా నకిలీ సరుకులని, దేశసమగ్రత గురించి మాట్లాడే అర్హత లేదని, వారి మాటల్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పటేకర్ తెలిపాడు.
సినిమాల్లోకి రాకముందు నానాపటేకర్ కి ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసిన అనుభవం వుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి