వైద్య రంగంలో చేసిన విశేష కృషికి గానూ జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒషుమి(71) కి నోబెల్ ప్రైజ్ ప్రకటించారు.
సెల్ రీసైక్లింగ్‌కు సంబంధించి కీలక ఆవిష్కరణలు చేసిన ఒషుమిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది. కణాల జీవపరిణామ క్రమంలో కొత్త కణాల పుట్టుక, పాత కణాల వినాశనం తదితర అంశాలపై ఆయన పరిశోధన చేశారు.
శరీరంలో నిరంతరం జరిగే కణాల పుట్టుక, వినాశనం, ఇందులో భాగంగా కణాలు తమకు తాముగా నిర్వీర్యం అయ్యే అంతుపట్టని అంశంపై ఆయన చేసిన విశేష పరిశోధనలకు గాను ఈ గుర్తింపు లభించింది.
కీలకమైన ఈ పరిశోధన వల్ల, పార్కిన్సన్, మధుమేహం సహా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను అర్థం చేసుకోవడం వాటి చికిత్స మరింత తేలికౌతుందని భావిస్తున్నారు. ఒషుమి పరిశోధనల ఫలితాలతో సెల్ రీసైక్లింగ్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆయన ప్రస్తుతం టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రైజ్ కింద ఆయన 9.36 లక్షల అమెరికన్ డాలర్లను అందుకోనున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి