సమంతతో తన రిలేషన్ గురించి మొదటిసారి నాగచైతన్య మనసువిప్పి మాట్లాడాడు. వివాహం వచ్చే ఏడాది వుంటుందని, త్వరలోనే ముహూర్తాలు పెట్టడం జరుగుతుందనీ వెల్ళడించాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలను చైతూ పంచుకున్నాడు. తమిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో అస్సలు తెలియదని,ఒకేసారి సినీ పరిశ్రమ లోకి రావడం వల్ల, అప్పటినుంచీ మంచి స్నేహితులమనీ , ఆ బంధం అలా అలా ప్రేమకు దారి తీసిందని తెలియజేసాడు.
సమంతలో నిజాయితీ, కష్టపడే గుణం వల్ల, ఆమెను ఇష్టపడినట్టు, అలాగే సమంత మతం మార్చుకున్నట్టు వస్తున్న వదంతుల్ని కూడా చైతూ కొట్టిపడేసాడు, తనకు అలాంటి పట్టింపులు లేవన్నాడు.
ముఖ్యమైన మరో విషయం, పెళ్ళైన తర్వాతకూడా సమంత నటించినా ఎలాంటి అడ్డు చెప్పనని, నాగ చైతన్య వెల్లడించాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి