వచ్చే సంక్రాంతి వెండితెరమీద ఆసక్తికర పోటీకి తెరతీసింది.
చిత్రీకరణ దాదాపు పూర్తికావడంతో పాటుగా,డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ముగింపుదశకు చేరుకోవడంతో, మిగతా అన్నిపనులు పూర్తిచేసి, సంక్రాంతికి ఖైదీ నెం.150 మూవీని రిలీజ్ చేస్తున్నట్టు, ఆ చిత్ర నిర్మాత చిరు తనయుడు రాంచరణ్ ప్రకటించడంతో సంక్రాంతి బరిలో రెండు బలమైన పుంజులు పోటీకి నిలబడట్టు అయింది!
ఎందుకంటే అంతకుముందే, బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు, ఆ చిత్ర యూనిట్ ప్రకటించివుంది.
కాబట్టి, తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరమైన పోటీ కనువిందు చెయ్యబోతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి