google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఇథియోపియాలో నరమేధం

3, అక్టోబర్ 2016, సోమవారం

ఇథియోపియాలో నరమేధం



నిత్యం నిరసనలతో అట్టుడికే ఇథియోపియా లో మరోసారి వీథులు రక్తమోడాయి.!

వసంతంలో అడుగుపెట్టే కాలానికి సూచికగా ఒరోమో ప్రావిన్స్‌ అంతటా ‘ఇరీచా’ ఆధ్యాత్మిక వేడుక ప్రతీఎటా ఘనంగా జరుగుతుంది.

ఈ ఉత్సవం నిర్వహిస్తున్న ప్రజలపై ఒరోమోలో ఆదివారం మిలటరీ బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు విచక్షణరహితంగా కాల్పులుజరపడంతో కనీసం 295 మంది చనిపోయారు.  వందల మంది గాయపడ్డారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్రకటనలు చేస్తారన్న ఉద్దేశంతో  ప్రభుత్వం ఈ వేడుకపై నిషేధాజ్ఞలు విధించింది. అయినా ప్రజలు పెద్దఎత్తున గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పాటలు, నృత్యాలు కొనసాగించడంతో పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు

ఇథియోపియా ఫెడరల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒరోమోలో చాలాకాలంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.  రాజధాని అడిస్‌ అబాబాకు 40 కిలోమీటర్ల దూరంలోని బిష్పొతు నగరంలో ఈ దుర్ఘటన జరిగింది.

 కాల్పులకు భయపడి ప్రజలు పారిపోతున్నపుడు  తొక్కిసలాట జరగడం వల్లే ఎక్కువ మంది చనిపోయి వుండొచ్చని తెలుస్తోంది. ఎక్కడ చూసినా మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది.

కాల్పులు జరిగిన విషయాన్ని ఫెడరల్‌ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఎంత మంది చనిపోయారో, గాయపడ్డారో సంఖ్య చెప్పలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి