google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సరిహద్దుల్లో మందుపాత్రలు

3, అక్టోబర్ 2016, సోమవారం

సరిహద్దుల్లో మందుపాత్రలు




పీఓకే లోని ఉగ్ర శిబిరాలపై భారత సర్జికల్‌ దాడుల అనంతరం సరిహద్దుల్లో యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

ఏ క్షణం ఎలావుంటుందో చెప్పలేని పరిస్థితుల్లో, ముందు జాగ్రత్త చర్యగా  మన సరిహద్దుల్లోని 1500  గ్రామాల్లోని 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వీరందరికీ పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లు, ఆశ్రయం కల్పిస్తున్నారు. కానీ ఆశ్చర్యకర్మైన విషయం ఏమిటంటే, చాలామంది,  ఇళ్లను వదిలి వచ్చేందుకు  విముఖత చూపుతున్నారు. మహిళలను,పిల్లలను వృద్దులను పంపి, మగవారు ఇళ్లవద్దే ఉండిపోతున్నారు.

 మిగతా సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లోని సరిహద్దు గ్రామాల్లో జనసాంద్రత ఎక్కువని అందుకే వీటిపై పాక్‌ సేనలు దాడులు జరిపే అవకాశం ఎక్కువని అందుకే బలవంతగానైనా ఖాళీ చేయించక తప్పని పరిస్థితులు వున్నాయని, సైనికాధికారులు చెబుతున్నారు.

గురువారం నుంచి గ్రామస్థులను తరలించే కార్యక్రమాలను అధికారులు ప్రారంభించారు. దీంతో సరిహద్దు పొడవునా ఉన్న గ్రామాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

కాగా, పాక్ దాడి చేయగలిగే  కీలకమైన సరిహద్దు గ్రామాల్లో, సరిహద్దు పొడవునా ముందుజాగ్రత్తగా మందుపాతరలను ఏర్పాటు చేయాలని సైన్యం నిర్ణయించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి