సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో కొత్తగా ఓ మూవీ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుగుతూన్న విషయం తెలిసిందే.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో అంతే భారీగా యాక్షన్ సన్నివేశాల్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అందులో బాగంగా ఒక కార్ చేజింగ్, పైట్ చిత్రీకరణ కోసం ఏకంగా 3కోట్ల వరకు ఖర్చుపెడ్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లవరకు వుంటుందని, తెలుగు తమిళ్ తో పాటుగా హిందీ, మలయాళంలో కూడా ఒకేసారి రిలీజ్ చెయ్యడం వల్ల ఈజీగా రికవర్ చెయ్యొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.
డైరెక్ట్ గా తెలుగులో స్టాలిన్ దర్శకుడిగా నిరాశపర్చినా, అపరిచితుడులాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మురుగదాస్ కి మంచిపేరుంది, అలాగే ఈమధ్య తమిళంలో తుపాకి, కత్తి లాంటి మంచి విజయాల్ని అందుకున్నాడు.
కాగా ఈ సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన వున్నట్టు తెలుస్తోంది.
క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న ఈ మూవీ విడుదలయ్యాక ఎన్ని సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి