google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: COOLPAD NOTE 5

2, అక్టోబర్ 2016, ఆదివారం

COOLPAD NOTE 5



Coolpad note 5 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది.

 శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ లేటెస్డ్  స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999. ప్రీమియమ్ షియోమీ రెడ్మీ నోట్ 3 తరహా బ్యాక్ ప్యానల్ తో వస్తోన్న ఈ ఫోన్ మెటల్ బాడీ డిజైనింగ్ ఆకట్టుకునేలా వుంటుంది.

ఈ ఫోన్ ప్రత్యేకతలు:

2.5డి కర్వుడ్ గ్లాస్‌‌తో 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1920×1080పిక్సల్స్ స్ర్కీన్ రిసల్యూషన్,
4జీబి ర్యామ్‌,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్‌,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా,
ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌,
64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్,
4,010 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ,
బ్యాటరీ 350 గంటల స్టాండ్ బై‌,
4G LTE,  అలానే vo LTE సపోర్ట్‌,
ఆండ్రాయిడ్ మార్షమెల్లో.

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ డివైస్ ధర కేవలం రూ.10,999 మాత్రమే కావడం వల్ల, కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్‌ను బీస్ట్ ఆఫ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ క్యాటగిరిగా కూల్‌ప్యాడ్ కంపెనీ అభివర్ణిస్తోంది.
ఈ ఫోన్‌లో జియో సిమ్ కూడా వాడుకోవచ్చు.

ఎస్డీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన సమయంలో ఒక సిమ్ మాత్రమే పనిచేస్తుంది. . ఫోన్లో డ్యూయల్ స్పేస్ ఫీచర్ ద్వారా ఫోన్ లో రెండు వేరు వేరు అకౌంట్‌లను ఏక కాలంలో నిర్వహించుకోవచ్చు.

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ అక్టోబర్ 20 నుంచి అమెజాన్‌లో  లభ్యమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి