google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఉగ్రవాదంపై బాలయ్య ఫైర్!

2, అక్టోబర్ 2016, ఆదివారం

ఉగ్రవాదంపై బాలయ్య ఫైర్!




 ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉగ్రవాదంపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదులు హద్దుమీరితే ప్రజలెవరూ సహించరని ఆయన అన్నారు.

రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేదని ఈ సంధర్భంగా బాలకౄష్ణ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్ని, శాంతిని గౌరవించే మనదేశంలో ప్రజలకు ఓపిక ఎక్కువనీ, అయినప్పటికీ దేనికైనా ఓ హద్దు ఉంటుందని  చెప్పారు.

ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువుగా మారిందనీ, తీవ్రవాదులు మాట వినకపోతే తగిన విధంగా సమాధానం చెప్పే సామర్థ్యం మనకుందని హెచ్చరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి