google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: భారత్ బాటలో పాక్

11, నవంబర్ 2016, శుక్రవారం

భారత్ బాటలో పాక్



నల్లధనాన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పాకిస్థాన్ కూడా నడవాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

పాకిస్థాన్ లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి,నల్లధనాన్ని అరికట్టేందుకు అక్కడ చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక కమిటీ ముందు ఒక తీర్మానం ప్రవేశపెడుతూ.. దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను వెనక్కి తీసుకోవాలని అందులో కోరారు.

మనీ లాండరింగ్, అవినీతిని తగ్గించడానికి, భారత దేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారని, అదేవిధంగా పాక్ లో కూడా అలాంటి ప్రయత్నమే చెయ్యాలని ఆ పార్టీ సూచించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి