google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఆర్కే క్షేమంగా వున్నాడు!

4, నవంబర్ 2016, శుక్రవారం

ఆర్కే క్షేమంగా వున్నాడు!




మావోయిస్టు కేంద్ర కమిటీసభ్యుడు రామకృష్ణ అలియాస్‌ ఆర్కే క్షేమంగానే ఉన్నాడని తమకు సమాచారం అందినట్లు పౌర హక్కుల సంఘం నేత వరవరరావు చెప్పారు.

ఏఓబీ లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత, ఆర్కే ఆచూకీ పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథయంలో వరవరరావు  మాట్లాడుతూ..ఆయన క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు.

మావోయిస్టు పార్టీలో కీలకనేత ఆర్కే కనిపించకుండా పోవడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. పోలీసులదగ్గరే బందీగా వున్నాడనీ, ఆయనకు ఎటువంటి హాని తలపెట్టొద్దనీ  పౌరహరక్కుల సంఘాల నేతలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.

రాస్ట్ర డీజీపి మాట్లాడుతూ..ఆర్కే పోలీసుల దగ్గరే వున్నాడన్న పౌరహక్కుల సంఘాల నాయకుల ఆరోపణలు ఒట్టి అభూత కల్పనలన్న విషయం ఇప్పటికైనా రుజువైందన్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి