పోలవరం ముంపు మండలాల్లోని కుకునూరులో వేల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.
విభజన ప్రక్రియలో భాగంగా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో చేరడంతో వేల కోట్లు విలువచేసే ఖనిజం ఆంధ్రాకి దక్కినట్టైంది.
కుకునూరులో 2.35 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల ఐరన ఓర్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించడానికి వీలుగా కేంద్రం అంగీకారం కూడా వ్యక్తం చేసింది. ఏపీఎండీసీ, విశాఖ ఉక్కు సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఉక్కుపై హక్కును పొందనున్నాయి.
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఒక్కటైన కుకునూరు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. ఈ మండలాలతో విస్తారమైన అటవీ ప్రాంతం, నదీ వనరులతో బాటుగా ఇప్పుడు ఇనుపనిక్షేపాలు కూడా ఏపీ జాబితాకే చేరాయి.
ఈ నిక్షేపాలని విశాఖ ఉక్కుకు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి