13 ఏళ్ల పాటు సాగిన కమల్-గౌతమి సహజీవనానికి బ్రేక్ పడబోతోంది.
దీనికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ స్వంత సినిమా ‘శభాష్‌నాయుడు’ సినిమా సమయంలో గౌతమి సూచించిన కాస్టూమ్స్‌పై కమల్ పెద్ద కూతురు శృతిహాసన్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. అప్పుడు మొదలైన వివాదం పెద్దదిగా మారి విడిపోయెంతవరకు వచ్చిందని సన్నిహితుల అంటున్నారు.
అంతేకాకుండా.. గౌతమి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆమె ఈమధ్య ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిసిందని చెబుతున్నారు.
ముందునుంచి రాజకీయాలంటే కమల్ హాసన్ కు పెద్దగా గిట్టదు. తన పొలిటికల్ ఎంట్రీ వల్ల కమల్‌కు ఎలాంటి నష్టం కలిగించకూడదన్న భావనతో కూడా గౌతమి ఈ నిర్ణయం తీసుకుని ఉండచ్చని కూడా అనుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి