10 కోట్ల మందిని జియో పరిథిలోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తాజాగా మరో సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు.
కేవలం 1000 రూపాయలకే అపరిమిత వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయంతో 4జీ స్మార్ట్‌ఫోన్ అందించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల మనసు గెలుచుకునేందుకే ఎల్‌టీఈ టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు.
మార్కెట్లో 4జీ స్మార్ట్ ఫోన్ 3 వేలకే దొరుకుతున్నప్పటికీ... వాటి వల్ల ఉన్న పూర్తి ఉపయోగాలు సరిగా తెలియకపోవడం వలొల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కొన్ని పట్టణ ప్రాంతాల వినియోగదారులకే పరిమితమయ్యాయి.
అపరిమిత డాటా సేవలు సెప్టెంబర్ 5న సేవలు ప్రారంభించి. ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకోగలిగిన రిలయెన్స్ ఫీచర్ పోన్లను మాత్రమే వినియోగిస్తున్న వారిని ఆకట్టుకోవడం కోసమని ఈ కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టింది.
వోల్ట్ టెక్నాలజీతో రూ.1000 నుంచి రూ.1500 లోపు ధర ఉండేలా రెండు రకాల ఫీచర్ ఫోన్లను రిలయన్స్ అభివృద్ధి చేసి, వచ్చే యేడాది జనవరి నుంచి మార్చిలోగా చౌక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇవి కూడా స్మార్ట్ ఫోన్లలానే పనిచేస్తాయనీ, ఇంటర్నెట్‌తో డాటా యాక్సిస్‌కు ఉపయోగపడడంతో పాటు, వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చునని రిలయన్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
కాకపోతే ఇది ఫీచర్ ఫోన్ కాబట్టి టచ్ స్క్రీన్ సదుపాయం మాత్రం వుండదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి