ప్రపంచవ్యాపతంగా భారీవసూళ్ళతో సంచలనం సృష్టించిన 'బాహుబలి' చిత్ర నిర్మాతల కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఆర్కా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం పై దాదాపు పది మందితో కూడిన ఐటీ శాఖ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా వారు పలు ఫైళ్లను తనిఖీ చేశారు.
‘బాహుబలి' మొదటిభాగం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రీకరణ ముగింపుదశకు చేరుకుంటొంది.
2017 ఏప్రిల్ 28న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రిలీజ్ కానుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి