500, వెయ్యి నోట్లు చెల్లవని ప్రకటించినందున తక్షణ అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
ఈనెల 11వ తేదీ రాత్రి 12 గంటల వరకు..
72 గంటలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాత నోట్లనూ తీసుకుంటారు.
డాక్టర్లు రాసిన మందుల చీటి చూపించి, మెడికల్ షాపుల్లో పాత 500, వెయ్యి నోట్లతో ఔషధాలు కొనవచ్చు.
రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రభుత్వ బస్ టికెట్ కౌంటర్లు, విమానాశ్రయాల్లో ఉన్న ఎయిర్‌లైన్ టికెట్ కౌంటర్లలో 500, 1000 పాత నోట్లు చెల్లుతాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే పెట్రోలు బంకులు, గ్యాస్ స్టేషన్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల స్టోర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిల్క్ బూతల్లోనూ 72 గంటలపాటు పాతనోట్లు చెల్లుబాటు అవుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి