google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: నారా లోకేష్ కామెడి ఆర్టిస్ట్!!

7, నవంబర్ 2016, సోమవారం

నారా లోకేష్ కామెడి ఆర్టిస్ట్!!




వైసీపి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి తన శైలిలో నారా లోకేష్ పై  వ్యంగ్యబాణాలు విసిరింది.

నిన్న జై ఆంధప్రదేశ్ పేరిట విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో రోజా మాట్లాడుతూ..ఏపీ సీయం చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బాబు తనయుడు నారా లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసీంది.

'నారా లోకేవ్ కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ.. కామెడీ విలన్ కు తక్కువ 'ని రోజ ఎద్దేవా చేసింది.

ప్రత్యేక హోదా కోసం జగన్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని  ప్రకటించారని.. మరి.. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా? అని రోజా సవాలు విసిరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో అయినా రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం ఉందా? అని  ఆమె నిలదీసింది.

వెంకయ్యనాయుడు చంద్రబాబులను వెన్నుపోటు బ్రదర్స్ గా రోజా నామకరణం చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి