ఆగ్‌మెంటెడ్ రియాలిటీ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్‌ఫోన్ మన ముందుకు వచ్చేస్తొంది. అదే సెర్చింజన్ దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన ‘లెనొవొ ఫ్యాబ్2 ప్రో’. ‘టాంగో’ టెక్నాలజీతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేకావడం గమనార్హం.
ఈ స్మార్ట్ ఫొన్ లో వున్న ప్రత్యేకత ఏంటంటే..వినియోగదారుడి ముందున్న వస్తువును త్రీడీ ఇమేజ్‌గా మార్చేసేలా ఈ ఫోన్‌లో ప్రత్యేక సెన్సర్లు వుంటాయి. ఫోన్ కెమెరాతో ఏదైనా వస్తువును చిత్రీకరించినప్పుడు ఆ విజువల్ త్రీడీలోకి మారిపోతుంది. సెన్సర్ల సాయంతో తీసిన వస్తువు ఎత్తు.. పొడవు.. పరిమాణం వంటి కొలతలను గుర్తిస్తుంది. ఆగ్‌మెంటెడ్ రియాలిటీ అంటే అదే.
ఈ ఫోన్ వినియోగదారులకోసమనే ప్రత్యేకంగా ‘టాంగో’ టెక్నాలజీతో పనిచేసే 32 యాప్‌లను గూగుల్ విడుదల చేసింది. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ‘పోకెమాన్ గో’ లాంటి ఆగ్‌మెంటెడ్ రియాలిటీ గేమ్‌లు కూడా ఉన్నాయి.
ఇంకా ఈ ఫోన్‌లోని ఫీచర్లు ఇలా వుంటాయి
* 6.4అంగుళాల డిస్‌ప్లే
* ఓఎస్: ఆండ్రాయిడ్ మార్ష్ మెల్లో 6.0
* స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్
* 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
* 4,050ఎంఏహెచ్ బ్యాటరీ
* కెమెరా: ఫ్రంట్ 8మెగాపిక్సెల్, వెనుక 16మెగాపిక్సెల్
ఈ ఫోన్ ధర ప్రస్తుతం 499.99డాలర్లు(రూ.33,326)గా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి