రూ.500, 1000 నోట్లు రద్దవడంతో వైయస్సార్సీపి నేత జగన్మోహన్ రెడ్డి షాక్ కి గురైవుంటాడని టీడీపి ఎంఎల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నాడు.
'ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, 100 నోట్లు రద్దు నిర్ణయం వినగానే నేను షాకయ్యాను. వెంటనే నా బీరువా తీసి చూసుకుంటే, 26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని ఎలా మార్చాలా అని ఆందోళన పడిపోయాను. నేనే ఈ రకంగా ఆందోళన చెందితే.. సోదరుడు జగన్ మోహన్‌రెడ్డి ఎంతగా ఆందోళన చెందివుంటాడో.. బెంగళూరు వైట్ హౌస్ అండర్ గ్రౌండ్లో ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియక షాకై ఉంటాడు" అని అన్నాడు.
చంద్రబాబు ఎప్పటినుంచో వెయ్యి, 500 నోట్లు రద్దు చేయాలని చెబుతున్నారు.ఈ కీలక నిర్ణయంలో చంద్రబాబు ప్రభావం చాలా వుంది ఉంది., దటీజ్ చంద్రబాబు. అని సోమిరెడ్డి వ్యాఖ్యానించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి