google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: హిల్లరీ - ట్రంప్ హోరాహోరీ..

1, నవంబర్ 2016, మంగళవారం

హిల్లరీ - ట్రంప్ హోరాహోరీ..





అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ఆధిక్యం అనేక మలుపులు తీసుకుంటోంది.

నవంబరు 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.  నిన్నటి వరకు రిప బ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై భారీ ఆధిక్యంలో కొనసాగిన డెమో క్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తాజా సర్వేల్లో ఒక్కసారిగా దెబ్బతిన్నారు.

 ప్రస్తుతం వస్తున్న అంచనాలను బట్టి ఆమె ట్రంప్ పై ఒక్క శాతం ఓట్ల మెజారిటీతోనే ఉన్నారని తేలింది. దీనికి  కారణం.. ఈ-మెయిల్స్‌ స్కామేనని స్పష్టమైంది. హిల్లరీ తన వ్యక్తిగత సర్వర్‌ ద్వారా అధికారిక కార్యకలాపాలు నిర్వహించిన కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యం కావడం..ఈ కేసును తిరిగి విచారించాలని ఎఫ్‌బీఐ నిర్ణయించడంతో హిల్లరీ ఆధిక్యం తగ్గిపోయింది.

ప్రస్తుత సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా మారుతూ వుండటంతో ట్రంప్ అనుకూలురు రెట్టించిన ఉత్సాహంలో వున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి