google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కాబోయే సీఎం లోకేశ్..

12, నవంబర్ 2016, శనివారం

కాబోయే సీఎం లోకేశ్..



యువనేత దగ్గర గుర్తింపుకోసమో లేక అభిమానమో చెప్పలేం గానీ... సీయం చంద్రబాబు కుర్చీకి అప్పుడే ఎసరు పెట్టడం మొదలు పెట్టారు కొందరు మంత్రులు.

భవిష్యత్‌లో  సీఎం నారా లోకేశే నని  మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు.

బండారుపల్లిలో శుక్రవారం రాత్రి జనచైతన్య యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు వారసుడు, కాబోయే సీఎం లోకేశ్‌ అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ  నారా లోకేశ్ ను తమ పార్టీ అధినాయకుడిగా ప్రజలను, కార్యకర్తలను ఒప్పించడానికి నెమ్మదిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తొంది.

రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలనేది అలవాటైన పాత విషయమే, ఐనా.. చంద్రబాబూ గమనిస్తున్నావా?!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి