కరెన్సీ నోట్ల రద్దుకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మళ్ళీ కేజ్రీవాల్ విమర్శల దాడి చేసాడు.
శాంతిభద్రతలు అదుపుతప్పక ముందే నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ముందు తన కార్పొరేట్ మిత్రులపై మోదీ కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు.
ప్రజలను పడ్తూన్న కష్టాలకు ప్రధాని క్షమాపణలు చెప్పితీరాలని డిమాండ్ చేశాడు.
ప్రధాని మరో 50 రోజులు ప్రజల్ని సహకరించాలని కోరుతున్నారని, అప్పటివరకూ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉండాలా అని కేజ్రీవాల్ ప్రశ్నించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి