google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: గుజరాత్ లో ముందే తెలుసా..??

11, నవంబర్ 2016, శుక్రవారం

గుజరాత్ లో ముందే తెలుసా..??




'పాతనోట్లు రద్దు  మంచిదే... అయితే.. ముందే చెప్పొద్దా? జాగ్రత్త పడేవాళ్ళం కదా అనీ, ఇప్పటికిప్పుడంటే ఎలా'  అని..ప్రతిపక్షాలతోపాటుగా,  సామాన్యజనం కూడా వ్యాఖ్యలు చేస్తుండొచ్చు.

అలా చేస్తే.. నల్లకుభేరులు ముందుగానే జాగ్రత్త పడ్తారని ప్రభుత్వం కారణంగా చూపిస్తూ వుండొచ్చు..

కానీ.. 7 నెలల ముందే కరెన్సీ నోట్ల రద్దు విషయం గుజరాత్ రాష్ట్రంలో మీడియాకు తెలుసన్న బలమైన సాక్ష్యం ఒకటి దొరికింది. రూ 500, 1000 నోట్లు రద్దుకాబోతున్నాయనే వార్త గుజరాత్ స్థానిక వార్తాపత్రికలో ఏడు నెలల క్రితమే  ప్రముఖంగా ప్రచురితమై వుంది.

బాజాపా అధికారంలో వున్న గుజరాత్ బడా బడా వ్యాపారవేత్తలకి జన్మస్థలంలాంటిది. నోట్ల రద్దు వార్త తెలుసుకున్న వాళ్ళంతా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని, వందల కోట్ల కరెన్సీని సేఫ్  చేసేసుకుని వుంటారని గట్టిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

( కాగ్ మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలతో )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి