వ్యక్తిగత సర్వర్ల నుంచి ఈమెయిల్స్ పంపి వివాదాల్లో ఇరుక్కున్న అమెరికా అధ్యక్ష పోటీదారు హిల్లరీ క్లింటన్ మెయిల్స్‌లో ఆసక్తికర అంశం బయటకొచ్చింది.
ఈ మైల్స్ లో ముఖ్యమైన అంశాలేవైనా ఉన్నాయేమోనని వెతుకుతున్న అమెరికన్ జర్నలిస్ట్ లకు భారతీయులకు ఆసక్తి కలిగించే అంశం కనిపించింది.
2011 నాటి ఆ లేఖలో.. హిల్లరీ తనకు సన్నిహితురాలైన హ్యుమా అబెదిన్‌ను అమితాబ్ గురించి అడిగారు. ‘‘కొన్నేళ్ల క్రితం మనం కలిసిన ప్రముఖ పాతతరం భారతీయ నటుడి పేరేమిటి’’ అని ఆమె ప్రశ్నించారు. ఆ నటుడు మరెవరో కాదు బిగ్ బీనే!
ఈమైల్స్ వివరాలను వికీలీక్స్ ఇటీవల బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి