అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ సంచలన విజయంపై అమెరికా మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రంప్ వ్యతిరేక బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. అమెరికావాసులు పెద్ద సంఖ్యలో వీధుల్లో ఆందోళన చేపట్టారు. ‘ఆయన మాకు అధ్యక్షుడు కాదు’‘దేశంలో విద్వేషానికి చోటులేదు’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
ట్రంప్ విధానాలవల్ల్ ఐ.టి. పరిశ్రమలు అనిశ్చితిలో పడుతుందేమోనని సిలికాన్ వ్యాలీలో ఆందోళన నెలకొంది. అమెరికాకు వలసవచ్చేవారికి త్వరగా అనుమతులు ఇచ్చే విషయమై సమస్యలు నెలకొంటాయని అంచనా వెస్తున్నారు.
న్యూయార్క్, షికాగో, ఫిలడెల్ఫియా, బోస్టన్, కాలిఫోర్నియా, కొలరాడో, లాస్ ఏంజెలెస్, పోర్ట్‌ల్యాండ్, అట్లాంటా, ఆస్టిన్, డెన్వర్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రముఖ ప్రాంతాల్లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయి. అధ్యక్ష భవనం బయట కొందరు నిరసన తెలియజేసారు.
న్యూయార్క్‌లోని ట్రంప్ ప్రధాన కార్యాలయం ట్రంప్ టవర్ పరిసరాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో ట్రంప్ టవర్‌వైపు వెళ్లే రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు.
‘చాలా అసంతృప్తి, దిగ్భ్రాంతికి గురయ్యాం. మా కుటుంబాలు, స్నేహితుల గురించి భయపడుతున్నాం’అని రాసిన బ్యానర్లను ర్యాలీలలో ప్రదర్శిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి