సాధారణంగా మనకు తెలిసిన ఏ స్మార్ట్ ఫోనైనా దాదాపుగా 4 నుండి 7 అంగుళాలవరకు వుంటాయి. అయితే అంతకన్నా తక్కువ స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్లకు వున్న ఫీచర్స్ తో వస్తే ఎలావుంటుందో వూహించగలరా?
ఇప్పుడు ప్రపంచంచలోనే అత్యంత చిన్న స్మార్ట్‌ఫోన్ వచ్చింది..ఈ చిట్టి ఫోన్ పేరు ‘వీఫోన్ ఎస్8'. ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 1.54 ఇంచులు మాత్రమే! చైనాలోని ‘వీఫోన్' అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ ఫోన్లో ఫీచర్స్ కూడా దుమ్మురేపే విధంగా ఉన్నాయి.
అయితే పరిమాణంలో ఇది పొట్టిదైనా.. ఫీచర్ల విషయంలో మాత్రం పెద్ద స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసుపోదు. ఆండ్రాయిడ్ ఓయస్ తో పనిచేసే దీనిని, ఇతర ఓఎస్‌లను సపోర్ట్ చేసే విధంగా కూడా తయారుచేయనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే దీనికి పవర్ బటన్ మాత్రమే ఉంటుంది. దీంతో పాటు తెరపై మరో మూడు వర్చువల్ బటన్స్ ఉంటాయి. మిగతా ఫోన్లలాగే స్పీకర్, మైక్రోఫోన్, బిల్ట్‌ఇన్ ఎఫ్‌ఎం రేడియో,అలాగే హార్ట్ రేట్ చూసేందుకు హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంటుంది. నడకను లెక్కించే పెడోమీటర్ కూడా ఉండటం ఇందులోని విశేషం గా చెప్పొచ్చు.
64ఎంబీ ర్యామ్ 128ఎంబీ ఇంటర్నల్ మెమొరీ(8జీబీ వరకు పెంచుకోవచ్చు) దీంతో పాటు 8జిబి టీ ఫ్లాష్ మెమొరీ ఉంటుంది. అయితే ఇది ఒక సిమ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే 3800 యంఏహెచ్ బ్యాటరీ వుంది. ఫోన్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే.
ఇంకా ఇండియా మార్కెట్లోకి ప్రవేశించని ఈ ఫోన్ ధర దాదాపు 30 డాలర్లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి