google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మోదీ ఓ తుగ్లక్‌!

17, నవంబర్ 2016, గురువారం

మోదీ ఓ తుగ్లక్‌!



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ సీఎం, మమతా బెనర్జీ విమర్శించింది.

మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ఉన్నట్టుండి రాజధానిని మార్చినట్టు, నేడు మోదీ అకస్మాత్తుగా నగదును మార్చేశారని ఆమె దుయ్యబట్టింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా మమత నేతృత్వంలో పలు విపక్ష పార్టీలు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. రద్దు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

మమత వెంట నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆప్‌, ఎన్డీయే భాగస్వామి శివసేన నేతలు వున్నారు.
ఎలాంటి ప్రణాళిక లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 8 రోజుల్లో దేశానికి రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వారు అన్నారు.

కాగా ఈ ర్యాలీ లో పాల్గొన్న శివసేన మాత్రం.. రద్దు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. రాష్ట్రపతికి ఇచ్చిన వినతిపత్రంపై తాము సంతకం చేయలేదని శివసేన స్పష్టం చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి